చీమ తనకంటే ఎక్కువ బరువులను ఎలా మోస్తుంది?
How An Ant Can bring Heavier Weights?
సాధారణంగా మన కంటికి కనిపించే చీమ ఎంత చిన్నదైనప్పటికినీ, చీమపై తెలుగు సాహిత్యంలో ఎంతో కొంత విశిష్ఠత ను మన వికటకవులు కల్పించారు. ఎంత చిన్న చీమ ఐన మనల్ని కుట్టగానే "అబ్బా " అనాల్సిందే. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న నానుడి మనందరికీ తెలిసిందే.
ఇక విషయానికొస్తే చీమ తనకంటే 50 రెట్లు బరువును మోయగలదు. తనకు అంత శక్తి ఎక్కడిదంటే చీమ శరీరంలో హెర్క్ లీన్ శక్తి ఉంటుంది. అంటే చీమ శరీర నిర్మాణంలో దాదాపు వెయ్యి రకాల మజిల్స్ (కండరాలు) ఉంటాయి. ఈ మజిల్స్ అలసటకు ఏమాత్రం లొంగిపోవు. అంటే చీమ కండరాలు ఎంత భారాన్ని,పనిని చేసిన అలసిపోని గుణాన్ని కలిగి ఉంటాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే చీమకు మూడు జతల కాళ్లు ఉండడం. తాను మోసే బరువునంతా తన 3 జతల కాళ్ళపైన విస్తరింపజేయడం వల్ల చీమ తన బరువు కన్నా అధిక రెట్ల బరువును మోయగలుగుతుంది.
Click For More https://bazigarr.blogspot.com/