Showing posts with label ఇక మీ వాట్సాప్ మరొకరు ఓపెన్ చేయలేరు.Finger print lock.Your WhatsApp Cannot Open Another .. Show all posts
Showing posts with label ఇక మీ వాట్సాప్ మరొకరు ఓపెన్ చేయలేరు.Finger print lock.Your WhatsApp Cannot Open Another .. Show all posts

Tuesday, 17 December 2019

ఇక మీ వాట్సాప్ మరొకరు ఓపెన్ చేయలేరు..Your WhatsApp Cannot Open Another by lock with fingerprint

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ ..తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగదారులకు ఆనందం నింపింది. కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఐవోఎస్ వినియోగదారులకు ఎప్పుడో అందుబాటులోకి వచ్చేయగా.. ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక మీ స్మార్ట్ ఫోన్ మరొకరి చేతిలో ఉన్నా.. ఓపెన్ చేసి చూసే అవకాశం మాత్రం ఉండదు.

వాట్సాప్‌లో ఫింగర్ ప్రింట్ ఫీచర్ పొందడం ఎలా..? అంటే ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.. అందులో అకౌంట్ సెట్టింగ్స్ పై క్లిక్ చేసి.. ప్రైవసీలోకి వెల్లాలి.. అక్కడ ఫింగర్ ప్రింట్ లాక్ కనిపిస్తుంది.. దానిపై ట్యాప్ చేసి ఎనేబుల్ చేస్తే.. మీరు ఫింగర్ ప్రింట్ ఇచ్చాక, మీ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ నే వాట్సాప్ అన్ లాక్ చేయడానికి కూడా ఉపయోగించమంటారా? అని అడుగుతుంది. అప్పుడు మీరు దాన్ని కన్ ఫర్మ్ చేస్తే చాలు. ఇక, ఆ ఆప్షన్ కింద మీకు ఒక టైమర్ కూడా కనిపిస్తుంది. లాక్‌కు సంబంధించిన సమయాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు.