Vasthu

 వాస్తు అనేది భారతదేశంలో అనేక సంవత్సరాలనుంచి ఇల్లు  కట్టుకునేటపుడు పాటించవలసిన నయమ నిబంధనల గురించి తెలియజేస్తుంది. వాస్తు కి భారతదేశ పురాతన గ్రంధాలలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. గృహం లేదా ఇల్లు కానీ లేక మరేదైనా కట్టడం కట్టుకోవాలంటే ప్రధానంగా ముందస్తు ప్రణాళిక ఎంతో అవసరం. అలాగే ప్రతీ కట్టడంలోనూ, స్థలంలోనూ కచ్చితమైన కొలతలతో నిర్మించాల్సి ఉంటుంది. 

                                                 అయితే ప్రధానంగా నిర్మాణానికి సంబంధించి దిక్కులు ప్రధాన భూమిక పోషిస్తాయి. ఈ దిక్కులు, స్థల వైశాల్యం అనేవి నిర్మించే నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తాయి. కాగా ఇక్కడ దిక్కులు అనగా ప్రధానంగా నాలుగు కలవు. అవి, 1. తూర్పు 2. పడమర. 3. ఉత్తరం. 4. దక్షిణం. 

ఈ నాలుగు దిక్కులే గాక మరో నాలుగు దిక్కులు అనగా,  ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి అను దిక్కులు కూడా వాస్తులో భాగంగా చెప్పబడుతుంది. 

No comments:

Post a Comment