Tuesday 19 November 2019

పబ్లిక్ ప్లేస్ లో ఫోన్ చార్జింగ్ పెడితే మీ డాటా గోవింద beware of charging in public places to escape from Juice jacking

*చార్జింగ్ పెట్టుకుంటే బ్యాంకు ఖాతా ఖాళి అయింది.*

దేశరాజధాని ఢిల్లీలో ఓ యువకుడు తన ఫోన్‌లో ఛార్జింగ్‌ అయిపోవడంతో దగ్గరలోని వాణిజ్య సముదాయానికి వెళ్లి అక్కడున్న యూఎస్‌బీ పోర్టు నుంచి ఉచితంగా ఛార్జింగ్‌ చేసుకున్నాడు...
కొద్దిసేపటికే అతని బ్యాంకు ఖాతా ఖాళీ అయింది.
నీ వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు మా దగ్గరున్నాయి...
అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని నీ ఫోన్‌లో ఉన్న నెంబర్లన్నింటికీ పంపుతామని ఆ యువకుడికి ఓ బెదిరింపు కాల్‌ కూడా వచ్చింది. దాంతో ఆ యువకుడు సైబర్‌ నిపుణులను ఆశ్రయించాడు. జరిగిందంతా విన్న నిపుణులు అతను #జ్యూస్‌జాకింగ్‌ కు గురైనట్లు గుర్తించారు.

#®జ్యూస్‌జాకింగ్‌అంటే..?
సులభంగా చెప్పాలంటే గ్లాసులో ఉన్న పళ్ల రసాన్ని స్ట్రాతో జుర్రుకున్నట్లే ఎలక్ట్రానిక్‌ ఉపకరణంలో ఉన్న సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యూఎస్‌బీ పోర్టు ద్వారా కొట్టేయడం అన్నమాట. స్మార్ట్‌ఫోన్లు, ఐప్యాడ్‌లు, ల్యాప్‌టాప్‌లు  ఛార్జింగ్‌ చేసుకోవడానికి పలు సంస్థలు, కార్యాలయాలు ఇప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. వాణిజ్యసముదాయాలు, ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లోనూ స్మార్ట్‌ పరికరాలు ఛార్జ్‌ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఛార్జింగ్‌ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. వాటిలో నాలుగైదు యూఎస్‌బీ కేబుల్స్‌ ఉంటాయి. మీరు ఫోన్‌, ల్యాప్‌టాప్‌ వంటివి వాటికి కనెక్ట్‌ చేస్తే చాలు ఛార్జింగ్‌ అవుతుంది. ఇలాంటి కేంద్రాల్లోకి ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లు చొరబడుతున్నారు. ఛార్జింగ్‌ కోసం అమర్చిన యూఎస్‌బీ పోర్టును మార్చేస్తున్నారు. దాని స్థానంలో అచ్చం అలాగే ఉండేలా సొంతంగా తయారుచేసిన పోర్టును అమరుస్తున్నారు. ఎవరైనా తమ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు ఛార్జింగ్‌ చేసుకునేందుకు వీటికి కనెక్ట్‌ చేయగానే ఛార్జింగ్‌ కావడం మొదలవుతుంది.
అదే సమయంలో ఉపకరణంలోని సమాచారమంతటినీ యూఎస్‌బీ పోర్టు తస్కరిస్తుంది.

®ఎలా జరుగుతుంది..?
ఏ స్మార్ట్‌ఫోన్‌లో అయినా ఛార్జింగ్‌, సమాచార మార్పిడికి వేర్వేరు పోర్టులు లేవు. దీన్నే నేరగాళ్లు అవకాశంగా మలుచుకుని జ్యూస్‌ జాకింగ్‌కు తెర లేపారు. ఛార్జింగ్‌ పెట్టుకునేటప్పుడు అదే కేబుల్‌ ద్వారా సమాచారం తస్కరిస్తున్నారు. #ఎవరైనాఛార్జింగ్‌చేసుకునేందుకుతమఉపకరణాన్నిఆకేబుల్‌కుఅనుసంధానించగానేసమాచారంగల్లంతవుతుంది. తస్కరించిన సమాచారమంతా యూఎస్‌బీ పోర్టులో నిల్వ అయిన తర్వాత దాన్ని తీసుకుని ఆ డేటాను సంగ్రహిస్తున్నారు. లేదంటే బ్లూటూత్‌కు అనుసంధానించి అందులో ఉన్న సమాచారాన్ని తమ దగ్గరున్న పరికరంలోకి బదిలీ చేసుకుంటున్నారు.
బెదిరింపులు షురూ...
ఒక్కసారి ఈ సమాచారం చేతికి చిక్కిన తర్వాత ఫోన్‌ యజమానిని బెదిరించడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు చాలామంది తమ బ్యాంకు ఖాతా వివరాలు పిన్‌ నెంబర్లు సహా ఫోన్‌లో దాచుకుంటున్నారు.
ఈ డేటా దొరకగానే నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
లేదంటే ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత విషయాలు బయట పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
వైరస్‌ చొప్పించి...
ఛార్జింగ్‌ పేరుతో సమాచారం తస్కరించడం ఒక ఎత్తయితే ఇంకొందరు నేరగాళ్లు మార్పిడి చేసిన యూఎస్‌బీ పోర్టు ద్వారా #వైరస్‌(ట్రోజన్‌హార్స్‌)లను ఫోన్లలోకి చొప్పిస్తున్నారు. అంటే ఛార్జింగ్‌ పెట్టగానే యూఎస్‌బీ పోర్టులో ఉన్న ట్రోజన్‌హార్స్‌ సదరు ఉపకరణంలోకి ప్రవేశించి దాన్ని తన అదుపులోకి తెచ్చుకుంటుంది.
తాము అడిగినంత డబ్బులివ్వకపోతే ఉపకరణం పనిచేయకుండా చేస్తామని, అందులో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగపరుస్తామని బెదిరింపులు మొదలుపెడుతున్నారు.

®#పరిష్కారంఏమిటి..?
వీలైనంత వరకూ పవర్‌బ్యాంకు దగ్గర పెట్టుకోవాలి. తద్వారా ఎక్కడపడితే అక్కడ ఛార్జింగ్‌ చేసుకోవాల్సిన పని ఉండదు.
బహిరంగ ప్రదేశాల్లో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు ఛార్జింగ్‌ చేసుకునేటప్పుడు వాటిని #స్విచాఫ్‌ చేయాలి.

ఫోన్‌ లాక్‌ చేసుకోవడం ద్వారా అందులో సమాచారం మరొకరు తస్కరించకుండా చూసుకోవచ్చు. #లాక్‌చేసిఉన్నఫోన్‌ నుంచి సమాచార మార్పిడి జరగదు.

ఛార్జింగ్‌ పెట్టేటప్పుడు సమాచార బదిలీ (డేటా ట్రాన్స్‌ఫర్‌) ఆప్షన్‌ను ఆఫ్‌ చేయాలి.
అప్రమత్తంగా ఉండండి.
ప్రజల వద్ద ఉన్న సమాచారాన్ని ఏదో ఒక రూపంలో కొల్లగొట్టేందుకు సైబర్‌ నేరగాళ్లు ప్రయత్నిస్తూనే ఉంటారు. సైబర్‌ నేరాల పట్ల అవగాహన పెంచుకుంటేనే ఇలాంటి వాటి నుంచి కాపాడుకోగలం. వీలైనంత వరకూ బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్‌ చేసుకోకుండా ఉండాలి. బ్యాటరీని జాగ్రత్తగా, అవసరం కోసం మాత్రమే వాడుకుంటే ఇలా ఎక్కడపడితే అక్కడ ఛార్జింగ్‌ చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.

Monday 18 November 2019

Stray dog tags along with Sabari pilgrims, treks 480km & so far

Stray dog tags along with Sabari pilgrims treks 480km & counting

A stray dog has been following a team of 13 Ayyappa Maladharis (devotees), who are on an annual barefoot pilgrimage to Sabarimala and have walked over 480km so far, from Tirupati in Andhra Pradesh to Kottigehara village of Chikkamagaluru district in Karnataka. The devotees have now decided to take it with them all the way up to Sabarimala in their spiritual journey. They said the dog sustained injuries to its paws a couple of times and was treated by local veterinarians.The dog joined the barefoot devotees, led by Rajesh Guruswamy, resident of Todar in Mudabidri, Dakshina Kannada district on October 31, when they started the pilgrimage from Tirupati Tirumala. The team reached Kottigehara on Sunday.
“We didn’t notice this dog at first. But, as we continued our journey, it kept popping up behind us every now and then. We offer the food we prepare for ourselves. The dog has a leather collar around its neck and is very shy,”
“We perform the Sabarimala pilgrimage every year. But this is a new experience,” the devotees said, with obvious delight.

WhatsApp has identified a vulnerability of a malicious MP4 file.



WhatsApp has identified a vulnerability that could have been exploited through a malicious MP4 file. India’s Computer Emergency Response Team (Cert-in) described the vulnerability’s severity rating as “high” and advised users to update to the latest version of WhatsApp.The vulnerability affected both Android and iOs systems. The company has rolled out a security update. “WhatsApp is constantly working to improve security. In this instance, there is no reason to believe users were impacted,” WhatsApp said in a statementon Sunday. The development comes just weeks after WhatsApp sued the Israeli company, NSO Group, over alleged misuse of their spyware Pegasus, which was installed in 1,400 users’ phones, including at least 120 Indians.In a post on its securities and advisory page, WhatsApp's parent company Facebook confirmed the vulnerability on November 14. The Certin website gives more details.“A remote attacker could send a specially crafted MP4 file to the target system. This could trigger a buffer overflow leading to the execution of arbitrary code by the attacker. The exploitation does not require authentication from the victim,” the website says.Cert-in says successful exploitation of the glitch could allow an attacker to cause “Remote Code Execution (RCE) or Denial of Service (DoS) condition, which could further compromise the system.

Crossed 150crores of downloads of tiktok app 150 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్న టిక్ టాక్ యాప్


 చైనాకు చెందిన ఈ టిక్ టాక్ అప్ 2017 వ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చింది . కాగా 2019,ఫిబ్రవరి లోనే 100 కోట్లమంది డౌన్ లోడ్  చేసుకున్నారు  . కాగా అప్పటినుండి కేవలం 9నెలల్లోనే మరో 50కోట్ల డౌన్లోడ్ లను అందుకుంది. మొత్తం 150కోట్ల డౌన్లోడ్స్ లో 48.68 కోట్ల (31%)డౌన్లోడ్లు ఇండియా నుండే చేసుకున్నారు. ఇండియాలో టిక్ టాక్ పై నిషేధం విధించినా కూడా దీనిని డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతలా పాపులర్ అవుతుందీ ఈ యాప్. మొబైల్ ఇంటెలిజెంట్ సంస్థ సెన్సార్ ప్రకారం 2019 సం. లోనే 61. 4 కోట్ల  మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 

చలికాలం లో గడ్డకట్టని డీజిల్ ను తయారు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

చలికాలం లో గడ్డకట్టని డీజిల్ ను తయారు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 
హిమాలయాల పరిసర ప్రాంత ఎత్తైన కొండలలో చలి కాలంలో మనుషులకే కాదు వాహనాల ఇంజిన్ లోని ఇంధనానికి కూడా సమస్యలు తలెత్తు తుంటాయి . కార్గిల్, లడఖ్, కీలంగ్, ఖాజా లాంటి ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -30 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంటాయి. దీనివల్ల వాహనాల్లోని డీజిల్ గడ్డ కట్టుకుపోయి వాహనాలు మొరాయిస్తుంటాయి. 
ఈ సమస్యనుండి గట్టెక్కేందుకు ఐ.ఓ. సి. (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) పరిష్కారాన్ని కనుగొన్నది. చలికాలంలో గడ్డ  కట్టని ప్రత్యేకమైన " వింటర్ గ్రేడ్ డీజిల్" ను సిద్ధం చేసింది. పానిపట్ లోని ఐఓసీ కర్మాగారంలో సిద్ధం చేసిన వింటర్ గ్రేడ్ డీజిల్ యొక్క పోర్ పాయింట్ -30 డిగ్రీల సెల్సియస్  వరకు ఉండి ద్రవ లక్షణాన్ని కోల్పోదు. పైగా BS 6 ప్రమాణాలను కలిగి ఉండడం దీని ప్రత్యేకత. ఇందువల్ల -30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న చలిలో కూడా వాహనాలు మొరాయించకుండా సాపీగా ముందుకు సాగుతాయి. తద్వారా ప్రయాణాలకు, రవాణాకు, పర్యాటకానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది. 

గుండెపోటుకు మనిషి ఎత్తు కూడా కారణమేనట Height also one of the cause to Heart Attack

గుండెపోటుకు మనిషి ఎత్తు కూడా కారణమేనట
Even Height Also One of the cause to Heart Attack 
ఇప్పటివరకు గుండెపోటు రావడానికి హై బీపీ ,మధుమేహం ( షుగర్),అధిక బరువు(స్థూల కాయం)లు మాత్రమే హార్ట్ ఎటాక్ (గుండెపోటు) కి దారితీస్తాయని  భావించే వాళ్ళం. కానీ సగటు మనిషి ఎత్తు కూడా గుండెపోటుకు కారణమవుతుందని అమెరికాలోని పెన్సిల్వేనియా వర్శిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గుండె కొట్టుకునే రేటు అసాధారణంగా పెరిగే బలహీనత (ఆట్రియల్ ఫిబ్రిలేషన్ ) కు మనిషి ఎత్తు కూడా కారణమవుతుందని వారి అధ్యయనంలో గుర్తించినట్లు తెలిపారు. సగటున 5feet 7inches (5అడుగుల 7అంగుళాలు)కంటే ఎత్తున్న  లక్షలాది మందిపై జరిపిన ప్రయోగ పరీక్షలు, ఆరోగ్య నివేదికల  పరిశీలనల అనంతరం ఈ నిర్ధారణకు వచ్చామన్నారు. సగటు ఎత్తు అంగుళం పెరుగుతున్నాకొద్ది గుండెపోటు  ముప్పు 3% పెరుగుతుందని అన్నారు. 

Online Games Under Restriction ఆన్ లైన్ గేమ్స్ పై నిషేధం

online Games Under Restriction 
ఆన్ లైన్ గేమ్స్ పై నిషేధం 
ఆన్ లైన్ గేమ్స్ ఆడేవారికి పిడుగు లాంటి వార్త ఇది. ఇకపై రోజులో 24 గంటలు ఎప్పుడు పడితే అప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకు వీల్లేదు.ఎందుకంటే రాత్రి గేమ్స్ ఆడడానికి అవకాశం లేదు. ఇటీవల ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ వాటికి బానిసలుగా మారిపోతున్నవారిని చాలా మందిని చూస్తున్నాం. ఇలా బానిసలుగా మారుతున్న వారిలో ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ ఆన్లైన్ గేమ్స్ కి చిన్నారులు బానిస కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న చైనా ఈ ఆటలు ఆడే వారిపై నిషేధం విధించబోతుంది. అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడేటువంటి సమయాన్ని కట్టడి చేయబోతుంది. దీని ప్రకారం చైనాలో చిన్నపిల్లలు రాత్రి 10:00 గంటలనుండి ఉదయం 08:00 గంటల వరకు ఆన్ లైన్ గేమ్స్ ఆడటానికి వీల్లేదు. 

Tuesday 12 November 2019

ఆధార్ కార్డు పై మళ్ళీ ఆంక్షలు

ఆధార్ కార్డు పై మళ్ళీ ఆంక్షలు

విశిష్ఠ గుర్తింపు సంఖ్య ఐన "ఆధార్ కార్డు"పై కేంద్రం మళ్ళీ ఆంక్షలు విధించింది. గతంలో  మాదిరి  ఆధార్ కార్డు లో పేరు,పుట్టిన తేదీ ,ఇతర వివరాలను మార్పు చేసుకునే విషయంలో కేంద్రం మార్పులు తెచ్చింది. కొత్త ఆంక్షలను విధించింది. ఇప్పటిదాకా పేరు, పుట్టిన తేదీ, ఇతర అంశాలను మార్పులు,చేర్పులు చేసుకునే విషయంలో ఎటువంటి పరిమితి లేదు. కానీ ఈ క్రొత్త నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు లో పేరులో  మార్పులుంటే రెండుసార్లు  మాత్రమే మార్పు చేసుకునే అవకాశం ఉంది. అలాగే పుట్టినతేది,లింగము వివరాలను ఒకసారి మాత్రమే మార్పు చేసుకోవలసి ఉంటుంది . ఎన్నిసార్లయినా అప్ డేట్ చేసుకునే విషయంలో దుర్వినియోగం అవుతుందని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఉడాయి ఈ క్రొత్త నిబంధనలను తెచ్చింది. ఒకవేళ నిర్దిష్ట అవకాశాలను మించి అంటే ఎక్కువసార్లు మార్పులు,చేర్పులు చేయాలనుకుంటే సమీప ఆధార్ ప్రాంతీయ కార్యాలయం,కార్డు దారు నుండి  అదనపు సమాచారం కోరే అవకాశం ఉంది. అవసరమైతే క్షేత్రస్థాయి వెరిఫికేషన్ కూడా ఉంటుంది.