Monday 18 November 2019

చలికాలం లో గడ్డకట్టని డీజిల్ ను తయారు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

చలికాలం లో గడ్డకట్టని డీజిల్ ను తయారు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 
హిమాలయాల పరిసర ప్రాంత ఎత్తైన కొండలలో చలి కాలంలో మనుషులకే కాదు వాహనాల ఇంజిన్ లోని ఇంధనానికి కూడా సమస్యలు తలెత్తు తుంటాయి . కార్గిల్, లడఖ్, కీలంగ్, ఖాజా లాంటి ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -30 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంటాయి. దీనివల్ల వాహనాల్లోని డీజిల్ గడ్డ కట్టుకుపోయి వాహనాలు మొరాయిస్తుంటాయి. 
ఈ సమస్యనుండి గట్టెక్కేందుకు ఐ.ఓ. సి. (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) పరిష్కారాన్ని కనుగొన్నది. చలికాలంలో గడ్డ  కట్టని ప్రత్యేకమైన " వింటర్ గ్రేడ్ డీజిల్" ను సిద్ధం చేసింది. పానిపట్ లోని ఐఓసీ కర్మాగారంలో సిద్ధం చేసిన వింటర్ గ్రేడ్ డీజిల్ యొక్క పోర్ పాయింట్ -30 డిగ్రీల సెల్సియస్  వరకు ఉండి ద్రవ లక్షణాన్ని కోల్పోదు. పైగా BS 6 ప్రమాణాలను కలిగి ఉండడం దీని ప్రత్యేకత. ఇందువల్ల -30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న చలిలో కూడా వాహనాలు మొరాయించకుండా సాపీగా ముందుకు సాగుతాయి. తద్వారా ప్రయాణాలకు, రవాణాకు, పర్యాటకానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది. 

No comments:

Post a Comment