చైనాకు చెందిన ఈ టిక్ టాక్ అప్ 2017 వ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చింది . కాగా 2019,ఫిబ్రవరి లోనే 100 కోట్లమంది డౌన్ లోడ్ చేసుకున్నారు . కాగా అప్పటినుండి కేవలం 9నెలల్లోనే మరో 50కోట్ల డౌన్లోడ్ లను అందుకుంది. మొత్తం 150కోట్ల డౌన్లోడ్స్ లో 48.68 కోట్ల (31%)డౌన్లోడ్లు ఇండియా నుండే చేసుకున్నారు. ఇండియాలో టిక్ టాక్ పై నిషేధం విధించినా కూడా దీనిని డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతలా పాపులర్ అవుతుందీ ఈ యాప్. మొబైల్ ఇంటెలిజెంట్ సంస్థ సెన్సార్ ప్రకారం 2019 సం. లోనే 61. 4 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.
బాజిగర్ - తెలుగు బ్లాగు. నా బ్లాగ్ ని విజిట్ చేసే వారందరికీ నా అభివందనములు. ఈ బ్లాగులో నాకు తెలిసిన అనేక మంచి విషయాలు మీతో పంచుకునేందుకు ఎంతో ఆసక్తి ని కలిగి ఉన్నాను. ఆదరిస్తారని ఆశిస్తూ... మీ బాజిగర్.
Monday, 18 November 2019
Crossed 150crores of downloads of tiktok app 150 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్న టిక్ టాక్ యాప్
చైనాకు చెందిన ఈ టిక్ టాక్ అప్ 2017 వ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చింది . కాగా 2019,ఫిబ్రవరి లోనే 100 కోట్లమంది డౌన్ లోడ్ చేసుకున్నారు . కాగా అప్పటినుండి కేవలం 9నెలల్లోనే మరో 50కోట్ల డౌన్లోడ్ లను అందుకుంది. మొత్తం 150కోట్ల డౌన్లోడ్స్ లో 48.68 కోట్ల (31%)డౌన్లోడ్లు ఇండియా నుండే చేసుకున్నారు. ఇండియాలో టిక్ టాక్ పై నిషేధం విధించినా కూడా దీనిని డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతలా పాపులర్ అవుతుందీ ఈ యాప్. మొబైల్ ఇంటెలిజెంట్ సంస్థ సెన్సార్ ప్రకారం 2019 సం. లోనే 61. 4 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.
చలికాలం లో గడ్డకట్టని డీజిల్ ను తయారు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
చలికాలం లో గడ్డకట్టని డీజిల్ ను తయారు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
హిమాలయాల పరిసర ప్రాంత ఎత్తైన కొండలలో చలి కాలంలో మనుషులకే కాదు వాహనాల ఇంజిన్ లోని ఇంధనానికి కూడా సమస్యలు తలెత్తు తుంటాయి . కార్గిల్, లడఖ్, కీలంగ్, ఖాజా లాంటి ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -30 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంటాయి. దీనివల్ల వాహనాల్లోని డీజిల్ గడ్డ కట్టుకుపోయి వాహనాలు మొరాయిస్తుంటాయి.
ఈ సమస్యనుండి గట్టెక్కేందుకు ఐ.ఓ. సి. (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) పరిష్కారాన్ని కనుగొన్నది. చలికాలంలో గడ్డ కట్టని ప్రత్యేకమైన " వింటర్ గ్రేడ్ డీజిల్" ను సిద్ధం చేసింది. పానిపట్ లోని ఐఓసీ కర్మాగారంలో సిద్ధం చేసిన వింటర్ గ్రేడ్ డీజిల్ యొక్క పోర్ పాయింట్ -30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండి ద్రవ లక్షణాన్ని కోల్పోదు. పైగా BS 6 ప్రమాణాలను కలిగి ఉండడం దీని ప్రత్యేకత. ఇందువల్ల -30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న చలిలో కూడా వాహనాలు మొరాయించకుండా సాపీగా ముందుకు సాగుతాయి. తద్వారా ప్రయాణాలకు, రవాణాకు, పర్యాటకానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది.
గుండెపోటుకు మనిషి ఎత్తు కూడా కారణమేనట Height also one of the cause to Heart Attack
గుండెపోటుకు మనిషి ఎత్తు కూడా కారణమేనట
Even Height Also One of the cause to Heart Attack
ఇప్పటివరకు గుండెపోటు రావడానికి హై బీపీ ,మధుమేహం ( షుగర్),అధిక బరువు(స్థూల కాయం)లు మాత్రమే హార్ట్ ఎటాక్ (గుండెపోటు) కి దారితీస్తాయని భావించే వాళ్ళం. కానీ సగటు మనిషి ఎత్తు కూడా గుండెపోటుకు కారణమవుతుందని అమెరికాలోని పెన్సిల్వేనియా వర్శిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గుండె కొట్టుకునే రేటు అసాధారణంగా పెరిగే బలహీనత (ఆట్రియల్ ఫిబ్రిలేషన్ ) కు మనిషి ఎత్తు కూడా కారణమవుతుందని వారి అధ్యయనంలో గుర్తించినట్లు తెలిపారు. సగటున 5feet 7inches (5అడుగుల 7అంగుళాలు)కంటే ఎత్తున్న లక్షలాది మందిపై జరిపిన ప్రయోగ పరీక్షలు, ఆరోగ్య నివేదికల పరిశీలనల అనంతరం ఈ నిర్ధారణకు వచ్చామన్నారు. సగటు ఎత్తు అంగుళం పెరుగుతున్నాకొద్ది గుండెపోటు ముప్పు 3% పెరుగుతుందని అన్నారు.
Online Games Under Restriction ఆన్ లైన్ గేమ్స్ పై నిషేధం
online Games Under Restriction
ఆన్ లైన్ గేమ్స్ పై నిషేధం
ఆన్ లైన్ గేమ్స్ ఆడేవారికి పిడుగు లాంటి వార్త ఇది. ఇకపై రోజులో 24 గంటలు ఎప్పుడు పడితే అప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకు వీల్లేదు.ఎందుకంటే రాత్రి గేమ్స్ ఆడడానికి అవకాశం లేదు. ఇటీవల ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ వాటికి బానిసలుగా మారిపోతున్నవారిని చాలా మందిని చూస్తున్నాం. ఇలా బానిసలుగా మారుతున్న వారిలో ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ ఆన్లైన్ గేమ్స్ కి చిన్నారులు బానిస కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న చైనా ఈ ఆటలు ఆడే వారిపై నిషేధం విధించబోతుంది. అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడేటువంటి సమయాన్ని కట్టడి చేయబోతుంది. దీని ప్రకారం చైనాలో చిన్నపిల్లలు రాత్రి 10:00 గంటలనుండి ఉదయం 08:00 గంటల వరకు ఆన్ లైన్ గేమ్స్ ఆడటానికి వీల్లేదు.
Tuesday, 12 November 2019
ఆధార్ కార్డు పై మళ్ళీ ఆంక్షలు
విశిష్ఠ గుర్తింపు సంఖ్య ఐన "ఆధార్ కార్డు"పై కేంద్రం మళ్ళీ ఆంక్షలు విధించింది. గతంలో మాదిరి ఆధార్ కార్డు లో పేరు,పుట్టిన తేదీ ,ఇతర వివరాలను మార్పు చేసుకునే విషయంలో కేంద్రం మార్పులు తెచ్చింది. కొత్త ఆంక్షలను విధించింది. ఇప్పటిదాకా పేరు, పుట్టిన తేదీ, ఇతర అంశాలను మార్పులు,చేర్పులు చేసుకునే విషయంలో ఎటువంటి పరిమితి లేదు. కానీ ఈ క్రొత్త నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు లో పేరులో మార్పులుంటే రెండుసార్లు మాత్రమే మార్పు చేసుకునే అవకాశం ఉంది. అలాగే పుట్టినతేది,లింగము వివరాలను ఒకసారి మాత్రమే మార్పు చేసుకోవలసి ఉంటుంది . ఎన్నిసార్లయినా అప్ డేట్ చేసుకునే విషయంలో దుర్వినియోగం అవుతుందని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఉడాయి ఈ క్రొత్త నిబంధనలను తెచ్చింది. ఒకవేళ నిర్దిష్ట అవకాశాలను మించి అంటే ఎక్కువసార్లు మార్పులు,చేర్పులు చేయాలనుకుంటే సమీప ఆధార్ ప్రాంతీయ కార్యాలయం,కార్డు దారు నుండి అదనపు సమాచారం కోరే అవకాశం ఉంది. అవసరమైతే క్షేత్రస్థాయి వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Subscribe to:
Posts (Atom)





