Saturday 12 October 2019

What is Demat Account? How to open this?డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి? ఓపెన్ చేయడం ఎలా?

డీమ్యాట్  అకౌంట్ అంటే ఏమిటి? ఓపెన్ చేయడం ఎలా?


క బ్యాంక్ లో ఏవిధంగా మనము డబ్బులు డిపాజిట్ చేయాలన్నా విత్ డ్రా చేయాలన్న మనకు  బ్యాంకు అకౌంట్ అవసరమో, అలాగే షేర్ మార్కెట్లో షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా డీమ్యాట్ అకౌంట్ అవసరం. అయితే మొదట డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ముందుగా మనకి బ్యాంకు అకౌంట్ ఉండితీరాలి. ఏందుకంటె మీ స్టాక్స్ యొక్క డివిడెండ్స్ , బోనస్ లు మీ అకౌంట్లోనే జమ అవుతాయి కాబట్టి. ఐతే  డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి మీరు పాన్ కార్డు కలిగి ఉండి,ఏదేనా స్టాక్ బ్రోకరేజీ సంస్థ ను సంప్రదిస్తే వారు మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు. ఈ రోజుల్లో చాలా బ్రోకరేజీ సంస్థలు ఉచితంగానే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తున్నాయి. 
ఇండియాలో కొన్ని బ్రోకరేజీ కంపెనీలు: 

ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే డీమ్యాట్ అకౌంట్ యొక్క లావాదేవీలు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి. ఇదివరకు కాగిత రూపంలో షేర్స్ లావాదేవీలు జరుగగా ప్రస్థుతం  ఆన్లైన్  రూపంలోనే లావాదేవీలు జరుగుతున్నాయి.  డీమ్యాట్ అకౌంట్లో లావాదేవీలు చాలా భద్రంగా ఉంటాయి. మీ షేర్లను వేరేవాళ్లు మీకు తెలియకుండా గ్యాంబ్లింగ్ చేసే అవకాశం ఉండదు. 

బ్యాంక్ లలో మాదిరి ఒక బ్యాంకు యొక్క బ్రాంచ్లో ఒకటే బ్యాంకు ఖాతా  ఉండాల్సిన పని లేదు. అంటే ఒక వ్యక్తి ఒక్క డీమ్యాట్ అకౌంట్ ఖాతాని తెరవాలన్న నిబంధన లేదు.  ఎన్ని డీమ్యాట్ అకౌంట్లు  ఐన ఓపెన్ చేసుకోవచ్చు. 

No comments:

Post a Comment