Monday 7 October 2019

స్టాక్ లేదా షేర్ అంటే ఏమిటి? WHAT IS STOCK OR SHARE?

స్టాక్ లేదా షేర్ అంటే ఏమిటి?  WHAT IS STOCK OR SHARE?

ఒక కంపెనీ తన యాజమాన్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించగా వచ్చే వాటాలను స్టాక్ లేదా షేర్ అంటాము. ఈ స్టాక్ ని ఈక్విటీ, బాండ్స్ ఫైనాన్సియల్ సెక్యూరిటీ అని వివిధ రకాలుగా పిలుస్తారు. ఒక కంపెనీలో స్టాక్స్ కొనడం వల్ల మీరు కంపెనీలో భాగస్వాములు అవుతారు. గరిష్ట వాటాలను కొన్న వ్యక్తి గరిష్ఠ యాజమాన్య హక్కులను కలిగి చైర్మన్ లేదా డైరెక్టర్ కావచ్చును. 

ఉదాహరణకు ఒక కంపెనీ మూలధనంగా సేకరించాల్సిన రూ . 1,00,00,000 /- లను 10 విలువ కలిగిన 10,00,000 ల వాటాలుగా విభజిస్తే, అప్పుడు ప్రతీ ఒక వాటా లేదా షేర్ విలువ రూ. 10/- అవుతుంది.  ఈ షేర్స్ ని కంపెనీ వారు నిర్ణయించిన ధర ప్రకారం కొనవలసి ఉంటుంది. మీకు కంపెనీ లో ఉన్న షేర్స్ ని బట్టి మీ యాజమాన్య వాటా శాతం నిర్ణయింపబడుతుంది. అలాగే వాటాదారులకు కంపెనీ లాభాలలో వాటా చెల్లించబడును.  కంపెనీ తీసుకునే నిర్ణయాలలో వాటాదారులకు ఓటు హక్కు ఉంటుంది. 

No comments:

Post a Comment