Sunday 6 October 2019

Why People Invest in Stockmarket ? స్టాక్ మార్కెట్లో ప్రజలు ఎందుకు ఇన్వెస్ట్ లేదా పెట్టుబడి పెట్టాలి ?

WHY PEOPLE INVEST IN STOCKMARKET
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల మిగతా ఆదాయ వనరులలో పొందిన రాబడి కంటే అధిక రాబడి పొందవచ్చును. ఇందుకు మీకు స్టాక్ మార్కెట్ పై పరిపూర్ణ జ్ఞానం అవసరం. ఎందుకంటే ఏ పనిలోనైనా పూర్తి మెళకువలు తెలుసుకున్నపుడే దానిపై పట్టు సాధించి విజయం అనే అవకాశాలను పొందుతాము కదా . 
             
                                 స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతావా అని ఒక సాధారణ పౌరున్ని అడిగితే  అతడు ఆమ్మో అది ఒక జూదం ,లాటరీ , గుర్రపు పందెం లాంటిది  దానిలో సంపాదించాలంటే లక్ ఉండాలి అని సమాధానం  ఎదురవుతుంది.  కానీ నిజానికి ఇది అపోహ మాత్రమే. లాటరీ , గుర్రపు పందాలు గెలవడానికి అదృష్టం కావాలి కానీ , స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడానికి అవగాహన , మార్కెట్ రిస్క్ ను ముందే పసిగట్టగల చక్కటి పరిజ్ఞానం ఉంటె సరిపోతుంది. 
స్టాక్ మార్కెట్ ఒక మంచి పెట్టుబడి సాధనం . ప్రణాళిక ద్వారా , క్రమ పద్దతిలో పెట్టుబడి పెడితే లీగల్ గా అంటే చట్టబద్దంగా సంపాదించిన సంపద ఒక్క స్టాక్ మార్కెట్లో తప్ప దేనిలోనూ సంపాదించలేము. ఈ స్టాక్ మార్కెట్ ద్వారానే వారెన్ బఫెట్  ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరు గా నిలిచారు. ఇంకా ఎంతో మంది సంపాదిస్తూనే ఉన్నారు . 
ధీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పెట్టె పెట్టుబడుల తాలూకు లాభాలని గమనిస్తే స్టాక్ మార్కెట్ తర్వాతే బంగారం,స్థలాలు తదితర వ్యాపారాలు అని తెలుస్తుంది.  ఈ విషయాన్నీ అర్ధం చేసుకోడానికి ఈ క్రింది ఉదాహరణ ని ఒకసారి గమనించినట్లయితే ,

  • 1980 లో మీరు విప్రో కంపెనీ 100 రూపాయలు ముఖ విలువ గలవి ఒక 100 షేర్లను కొనడానికి 10000 రూపాయలను పెట్టుబడి పెట్టారనుకుంటే ఇప్పుడు వాటి విలువ సుమారుగా 433 కోట్ల పైమాటే . అదెలాగంటే ,
  • 1981 లో విప్రో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది .అంటే కంపెనీలో మీకు ఒక షేర్ ఉంటె అదనంగా ఇంకో షేర్ మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే  కంపెనీ మీకు ఇస్తుంది,అలా  మీరు కొన్న 100 షేర్లు ఇప్పుడు 200 షేర్లు అయ్యాయి . 
  • 1985 లో కంపెనీ మల్లి 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది. ఇప్పుడు మీ షేర్స్ 400 అయ్యాయి. 
  • 1987 లో కంపెనీ షేర్ల ముఖ విలువను 10 రూపాయలుగా విభజించి 1:1 నిష్పత్తిలో బోనస్  ప్రకటించింది. ఇప్పుడు మీ షేర్లు 8000 అయ్యాయి. 
  • 1990 లో మరల 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించగా 8000 షేర్లు కాస్తా 16000షేర్లు అయ్యాయి. 
  • 1993 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది . ఇక్కడ 16000 షేర్లు కాస్త 32000 షేర్లు అయ్యాయి. 
  • 1995 లో 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించగా  32000 షేర్లు 64000 షేర్లు అయ్యాయి. 
  • 1998 లో కంపెనీ 2:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది. ఇక్కడ అమాంతం 64000 షేర్లు కాస్త 192000 షేర్లు అయ్యాయి. 
  • 1999 లో కంపెనీ షేర్ల ముఖ విలువను 2 రూపాయలుగా విభజించగా 192000 షేర్లు కాస్త 9,60,000 షేర్లు అయ్యాయి. 
  • 2004 లో విప్రో  2:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించగా మరల 9,60,000 షేర్లు కాస్తా 28,80,000 షేర్లు అయినవి. 
  • 2005 లో 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించగా మీ షేర్స్ ఇప్పుడు 57,60,000 షేర్స్ అయినవి. 
  • 2010 లో 2:3 నిష్పత్తిలో బోనస్ ప్రకటించగా మీకు ఉన్న షేర్లు 96,00,000. 
అంటే 96,00,000 షేర్ల విలువ లెక్కగడితే 432,00,00,000 రూపాయలు. అక్షరాలా  నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు.  

అంటే ఒక ప్రణాళిక ప్రకారం మంచి స్టాక్ ను ఎన్నుకొని దానిలో ఇన్వెస్ట్ చేస్తే లాభం ఎలా ఉంటుందో పై ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. కనుక స్టాక్ మార్కెట్ పై అపోహలు మాని ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక లాభాలను సొంతం చేసుకోవచ్చును గనుకనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి.


No comments:

Post a Comment