![]() |
SUCCESSFUL TRADING TIPS IN TELUGU |
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన నియమాలు :
- SEBI ( STOCK EXCHANGE BOARD OF INDIA ) అనుమతి ఉన్న స్టాక్ ఎక్సేంజ్ లలో సభ్యత్వం ఉన్న , గుర్తింపు ఉన్న బ్రోకర్లు ,సబ్ బ్రోకర్లు ద్వారా మాత్రమే ట్రేడింగ్ లావాదేవీలు జరపాలి.
- ట్రేడింగ్ చేయడానికి ముందు షేర్స్ కి సంబందించిన పూర్తి వివరాలు అంటే ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ స్టాక్ కి సంబందించిన పూర్తి విశ్లేషణ , అవగాహన తెలిసి ఉండాలి.
- ప్రతీసారి లాభాలు వస్తాయని భ్రమతో అవగాహన లేకుండా ట్రేడింగ్ చేయవద్దు.
- కంపనీ స్థితి గతులు, పనితీరు, క్వార్టర్లీ రిజల్ట్స్, భవిష్యత్తు, వంటి అంశాలను విశ్లేషించిన తరువాతే ఏ స్టాక్ లో నైనా పెట్టుబడి పెట్టాలి.
- స్టాక్ బ్రోకర్ లకి చెల్లించే మొత్తాలను బ్యాంకు ద్వారానే చెల్లించాలి .
- మీరు చేసే ట్రేడింగ్ లో స్టాప్ లాస్ ను కచ్చితంగా పెట్టాలి.
- మీరు ఏంత నష్టాన్ని భరించగలుగుతారో అందుకు అనుగుణమైన పెట్టుబడి వ్యూహాలను అనుసరించాలి. ఏందుకంటె షేర్ మార్కెట్ ట్రేడింగ్ లో ఎంతోకొంత నష్ట భయం ఉంటుంది.
- ఎవరో చెప్పారని, వదంతులు వచ్చాయని ఏ స్టాక్ లోనూ పెట్టుబడి పెట్టవద్దు. నిజమా, కాదా అని నిర్దారించుకున్నాకే ఇన్వెస్ట్ చేయండి.
- స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో లాభాలెంత సహజమో, నష్టాలు కూడా అంతే సహజం అని గుర్తుంచుకోవాలి.
- తక్కువ ధరకి లభిస్తున్నాయని బలహీన కంపెనీ షేర్స్ కొనవద్దు.
No comments:
Post a Comment