Saturday 21 December 2019

బొద్దింకల్ని తరిమికొట్టండి ఇలా

ఇళ్లు, స్టోర్‌ రూంలలో బొద్దింకలు కామన్. ఇంటిని ఎంత క్లీన్‌గా ఉంచినా, ఏదో ఒక రకంగా బొద్దింకలు వస్తూనే ఉంటాయి. వాటిని తేలిగ్గా తీసుకుంటే... వాటి సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. అవి ఎంత డేంజరంటే... ఆహార పదార్థాలపై బ్యాక్టీరియాను వదిలిపెడతాయి. తినే పదార్థాలు పాడయ్యేలా చేస్తాయి. వేగంగా పాకుతూ పిల్లల్ని భయపెడతాయి. ఒకటేంటి... బొద్దింకలతో అన్నీ సమస్యలే. అడ్డమైన రోగాలూ వచ్చేందుకు కారణమయ్యే బొద్దింకలు రాకుండా... మార్కెట్‌లో రకరకాల స్ప్రేలు ఉన్నా... వాటిని వాడితే... మనకూ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ స్ప్రే గాల్లో కలిసి... మనమూ పీల్చే పరిస్థితి ఉంటుంది. దాని బదులు సహజసిద్ధంగా వాటిని తరిమికొట్టే అవకాశమూ ఉంది.

బొద్దింకలకు పసుపు రంగు... నలుగు రంగులా కనిపిస్తుంది. అందువల్ల పసుపు రంగు ఉన్న చోట బొద్దింకలు పెరుగుతాయి. నీటి చమ్మ ఉన్న చోట బొద్దింకలు పెరుగుతాయి. నీడగా, చీకటిగా ఉండే ప్రాంతాల్లో అవి కాలనీలు పెడతాయి. వాటిని సహజ సిద్ధంగా తరిమికొట్టే ఛాన్స్ ఉన్నప్పుడు... స్ప్రేలు, పురుగు మందులూ వాడాల్సిన అవసరం ఏముంది?

Bay leaves : పులావులో వేసే బే ఆకులతో తేలిగ్గా బొద్దింకల్ని తరిమికొట్టొచ్చు. కిచెన్‌లోని వేర్వేరు ప్రదేశాల్లో బే ఆకుల్ని చల్లాలి. వాటి వాసన చూస్తే చాలు... వార్నాయనో అనుకుంటూ బొద్దింకలు పారిపోతాయి.

Use of cloves : లవంగాలు తెలుసు కదా... వాటిని వంటగదిలోని మూలలు, డ్రాయర్లు, ర్యాకులు, షెల్ఫులలో అక్కడక్కడా ఉంచండి. లవంగాల వాసన బొద్దింకలకు అస్సలు పడదు. వారానికోసారి పాత లవంగాల్ని తీసేసి... కొత్త లవంగాల్ని పెడుతూ ఉంటే... ఇక బొద్దింకలు రానే రావు.

Boric Powder and Sugar Mix : బోరిక్ పౌడర్, పంచదారను సమాన మోతాదులో తీసుకొని కలపాలి. ఆ పొడిని వంటగదిలోని మూలల్లో చల్లాలి. అప్పుడు బొద్దింకలు రమ్మన్నా రావు. చీకటిగా, ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో ఈ పొడి వెయ్యడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

The use of neem : వేప ఆకుల వల్ల ఎన్నో ప్రయోజనాలు. బొద్దింకల్ని పంపించేసేందుకు... వేప నూనె, వేప ఆకుల్ని వాడొచ్చు. వేప నూనె, వేప పొడిని కిచెన్‌లో చల్లితే చాలు... ముఖ్యంగా రాత్రివేళ తడిగా ఉండే ప్రదేశాల్లో చల్లితే... బొద్దింకలు పారిపోతాయి. ఇలా కంటిన్యూగా చేస్తూ ఉంటే... బొద్దింకల సమస్య తీరిపోతుంది.

No comments:

Post a Comment