Saturday 21 December 2019

ఎక్కిళ్లు.. ఎందుకొస్తాయి? why did hiccups comes and disturbing to me ?

ఎక్కిళ్లు.. ఎందుకొస్తాయి?

ఎక్కిళ్లు.. ఒకటీ, రెండు సార్లు వస్తే ఒకే… అదే ఆగకుండా వస్తూనే ఉంటే.. నోరు తెరిచి రెండు మాటలు మాట్లాడలేం. ఒక్కోసారి ఊపిరికి కూడా బ్రేకులు వేసినట్లు అవుతుంది. ఇవి ఒక్కొక్కళ్లకు సెకన్ల గ్యాప్‌లో ఆగిపోతాయి. కొందరికి అర గంట గడిచినా ఆగవు. ఇలా ఎక్కువ సేపు ఇబ్బంది పెట్టనప్పుడు గుండె, ఊపిరితిత్తుల భాగంలో నొప్పి వచ్చి, చెప్పలేని బాధకు కారణమవుతుంది.
ఎక్కిళ్లు కేవలం గొంతులో స్టార్ట్ అయ్యేవి కాదు. ఊపిరి తీసుకునే ప్రాసెస్‌కు సంబంధించినవి. ఊపిరితిత్తులు, పొట్ట భాగాలను వేరు చేస్తూ పక్కటెముకలను అంటిపెట్టుకుని డోమ్ షేప్‌లో ఓ పెద్ద కండరం ఉంటుంది. దీన్ని డయాఫ్రాగ్మ్ అంటారు. ఊపిరి పీల్చినప్పుడు ఇది కిందికి వెళ్లి లంగ్స్‌లోకి గాలి వస్తుంది. మళ్లీ డయాఫ్రాగ్మ్ పాత పొజిషన్‌కు వచ్చినప్పుడు నోరు, ముక్కులోంచి గాలి బయటకు వెళ్తుంది. కానీ, ఒక్కసారిగా డయాఫ్రాగ్మ్ కండరాలు ఇరిటేట్ (ఉద్రేకానికి గురైతే) అయినప్పుడు సడన్‌గా గొంతులోకి గాలి స్పీడ్‌గా వస్తుంది. ఆ గాలి వాయిస్ బాక్స్‌కు గట్టిగా తగిలి, ఉన్నట్టుండి వోకల్ కాడ్స్ మూసుకుపోయి ఓ శబ్ధం స్టార్ట్ అవుతుంది. ఆ శబ్ధమే ఎక్కిళ్లు.
ఇలా జరగడానికి కారణాలు
శారీరకంగా, మానసికంగా పడే ఒత్తిడి వల్ల డయాఫ్రాగ్మ్‌ను కలిపే బ్రెయిన్ నరాలు ఉద్రేకానికి గురై ఎక్కిళ్లు మొదలవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి ప్రధానమైన కారణాలు..
  • ఆహారాన్ని ఫాస్ట్‌గా మింగడం. నీళ్లు వేగంగా తాగడం.
  • స్ట్రెస్ ఫీలింగ్, సడన్‌గా ఏదైనా భావోద్వేగానికి, బాధకు గురవడం.
  • కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం.
  • శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు రావడం.
  • ఐస్, చూయింగ్ గమ్ లాంటివి తింటున్నప్పుడు ఒక్కసారిగా గాలి పీల్చడం.
ఎక్కిళ్లు ఆపడానికి చిట్కాలు
  • కొద్దిసేపు ప్రాణాయామం చేయడం. శ్వాసను నెమ్మదిగా, గట్టిగా ఒకవైపు నుంచి పీలుస్తూ.. మరోవైపు నుంచి వదులుతూ కొన్ని క్షణాలపాటు చేయాలి.
  • తలకిందులుగా ఆసనం వేసినా కొంతమందికి ఎక్కిళ్లు ఆగిపోతాయి.
  • రెండు మూడు సెకన్లు ముక్కును గట్టిగా పట్టుకోవడం లేదా పేపర్ బ్యాగ్‌లో ముఖం పెట్టి గట్టిగా శ్వాస పీల్చడం. ఈ రెండింటి ద్వారా ఊపిరితిత్తుల్లో కొద్దిసేపు కార్బన్‌డై ఆక్సైడ్ నిలిచి, డయాఫ్రాగ్మ్ కండరాలు రిలాక్స్ అవ్వొచ్చు.
  • మరిన్ని నీళ్లు తాగడం ద్వారా సాఫ్ కావొచ్చు.
  • గుప్పెడు నిండా చక్కెర తీసుకుని నోట్లో వేసుకుని నెమ్మదిగా చప్పరిస్తూ నమిలి మింగడం.
ఇలా ఉంటే డాక్టర్‌ని కలవడం మేలు
  • ఒక వేళ పై చిట్కాలేవీ పని చేయకపోతే, ఒక రోజంతా గడిచినా ఎక్కిళ్లు అదేపనిగా వస్తూనే ఉంటే డాక్టర్‌ని కలవడం మేలు.
  • సాధారణంగా ఎక్కిళ్లు కొద్ది నిమిషాల్లోనే ఆగిపోతాయి. అలా కాకుండా చాలాసేపు ఆగలేదంటే.. 24 గంటలకు మించి వస్తున్నాయంటే.. డయాఫ్రాగ్మ్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
  • ఇలా ఉంటే ఒక్కొక్కరికి వాంతులు కావడం, ఫిట్స్‌లా వచ్చే అవకాశాలు ఉంటాయి. గొంతులో కూడా డ్యామేజ్ అయ్యే చాన్స్ ఉంటుంది.
  • స్టెరాయిడ్స్, అనస్తీషియా ఎక్కువైనా.. పడకపోయినా, షుగర్ ఎక్కువగా ఉండడం, తీవ్రమైన కిడ్నీసమస్యలు ఉన్నా ఎక్కుళ్లు తీవ్రంగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
  • మాట్లాడడం, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారినా, ఆహారం తీసుకోలేనంతగా, నిద్రకు సమస్యగా మారినా వెంటనే డాక్టర్‌ని కలిస్తే మంచిది.
  • అలాగే ఎక్కిళ్లతో పాటు కడుపు నొప్పి, తీవ్రమైన జ్వరం, వాంతులు, దగ్గు, రక్తం పడడం లాంటివి ఉంటే సమస్య తీవ్రంగా ఉందని గుర్తించి హాస్పిటల్‌కు వెళ్లాలి.

No comments:

Post a Comment