Tuesday 3 December 2019

మహిళలను వేధిస్తే INDIAN PENAL CODE , I.T.ACT ప్రకారం విధించే శిక్షలు IMPRISONMENTS FOR WOMEN HARASSMENT IN INDIA

మహిళలను వేధిస్తే

INDIAN PENAL CODE , I.T.ACT ప్రకారం విధించే శిక్షలు 



ఐ.పీ.సి. సెక్షన్ 354 (ఎ )
లైంగికంగా వేధింపులకు సంబంధించి
వేధింపులు, దాడులు చేసిన వారిలో ఎంతమంది ఉన్నా సరే ఈ సెక్షన్ వర్తిస్తుంది. నేరం రుజువైతే  మూడు సంవత్సరాల నుండి ఏడు  సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.

ఐ.పీ.సి. సెక్షన్ 354 (బి)
 బలవంతపు దాడులకు ,వివస్త్రను చేయడం,శీలానికి భంగం కలిగించే చర్యలకు సంబంధించి
శిక్ష: కనిష్టంగా 3 సంవత్సరాలు, గరిష్టంగా 7సంవత్సరాలు జైలు శిక్ష .

ఐ.పీ.సి. సెక్షన్ 354 (సి)
మహిళల మానానికి భంగం కలిగించినట్లయితే, రహస్య కెమెరాలతో చిత్రీకరించడం
శిక్ష: కనిష్టం 1 సంవత్సరం,గరిష్టంగా 3 సంవత్సరాలు జైలు శిక్ష.

వెంటాడి వేధిస్తే
ఐ.పీ.సి. సెక్షన్ 354(డి )
శిక్ష: గరిష్టంగా 3 సంవత్సరాలు జైలు శిక్ష ,అదనంగా జరిమానా కూడా విధిస్తారు.

ఐ.పీ.సి. సెక్షన్ 302, 195 ఎ
అపహరించి అత్యాచారం చేసి చంపి శవాన్ని కాల్చి వేస్తే
శిక్ష: యావజ్జీవ కారాగార శిక్ష.

ఐ.టి. చట్టం సెక్షన్ 66 (సి)
మొబైల్ ఫోన్ కి అశ్లీల వీడియోలు పంపి ఇబ్బందికి గురిచేస్తే ,పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ప్రవర్తించిన (డేటింగ్ సైట్లలో ఫోన్ నెంబర్,ఫోటో,వ్యక్తిగత వివరాలు పోస్ట్ చేయడం, ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ లను తెరవడం, అర్ధరాత్రులు ఫోన్ చేసి వేధించడం )
శిక్ష: గరిష్టంగా 3 సంవత్సరాలు జైలు శిక్ష.

పోక్సో చట్టం 2012
చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే
శిక్ష: ఉరి శిక్ష


No comments:

Post a Comment