Wednesday 18 December 2019

makarajyoti darshan secrets of sabarimala Ayyappa శబరిమలలో మకరజ్యోతి దర్శనం వెనుక రహస్యాలివే

మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం ఒకటి. ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. దక్షిణ భారతంలోని ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి ఎప్పటి నుంచో వివాదం జరుగుతూనే ఉంది. అయితే ప్రతి సంవత్సరం నవంబర్ నుండి జనవరి వరకు అనేక మంది భక్తులు అయ్యప్ప మాలలను ధరిస్తారు. 41 రోజుల పాటు దీక్షలను చేస్తారు. అనంతరం శబరిమలలోని అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుంటారు.
అయితే మకర సంక్రాంతి రోజున కనబడే మకరజ్యోతి దర్శనం కోసం ఎక్కువ మంది భక్తులు వెళ్తుంటారు. అయితే కొందరు నాస్తికులు అని తమకు తాము హేతువాదులు అనుకుని, ఇక్కడ మకరజ్యోతి దర్శనం అనేది అంతా అబద్ధమని, అమాయక ప్రజలను మోసం చేసి జీవనోపాధి కోసం ఇలా చేస్తున్నారని చెబుతారు. ఈ నేపథ్యంలో మకరజ్యోతికి సంబంధించి అనేక రకాల కథలు బయటికొస్తున్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం....

18 పర్వత శ్రేణుల మధ్య..

శబరిమలలోని అయ్యప్పస్వామి దేవాలయం కేరళ పశ్చిమ పర్వత ప్రాంతంలో ఉంది. ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం కూడా ఉంది. మొత్తం 18 పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పూంకవనమ్ అని అంటారు. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు, కొండలతో నిండి ఉంటుంది.శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి ప్రతిష్టించినట్లు చెబుతారు.

ఓ నక్షత్రం..

శబరిమల కొండల్లో మకర సంక్రాంతి పండుగ రోజున సాయంత్రం, సూర్యా స్తమయంలో ఆకాశంలో కనిపించే పవిత్ర నక్షత్రం అని కొందరు చెబుతున్నారు. ఈ విశ్వంలో లక్షలాది నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. అయితే కొన్ని నక్షత్రాలు మాత్రం వంద సంవత్సరాలకు పైగా ప్రసిద్ధి చెందాయి. ఇందులో మకరానికి తెలిసిన నక్ష్రతం ఒకటి అని మరి కొందరు చెబుతున్నారు.


మకర జ్యోతి..

అయ్యప్ప స్వాముల దీక్షలు ప్రతి సంవత్సరం నవంబర్ నుండి జనవరి వరకు మూడు నెలల పాటు సాగుతాయి. 41 రోజుల మండల దీక్షల్లో ముఖ్యమైనది మకరజ్యోతి దర్శనం. అయ్యప్ప స్వామి సన్నిధిలో ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు ఓ దివ్యజ్యోతి ఆకాశంలో నుండి ప్రత్యక్షమై కొన్ని క్షణాలపాటు అందరికీ దర్శనమిస్తుంది. ఆ జ్యోతినే మకరజ్యోతి అంటారు.

అయ్యప్ప నామస్మరణ..

ఈ మకర జ్యోతి లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు తన్మయత్వాన్ని పంచుతుంది. ఆ క్షణాన శబరిగిరులన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతాయి. శబరమలలో అయ్యప్పస్వామి ఆలయం ఎదురుగా కంఠమల పర్వతాలలో మకర సంక్రాంతి నాడు సాయంత్రం చీకటి పడే వేళ మిణుకు మిణుకుమంటూ ఓ వెలుగు మూడుసార్లు కనిపిస్తుంది. ఆ వెలుగునే మకరజ్యోతి అని పిలుస్తారు. ఆ పర్వతాలలో అయ్యప్పస్వామికి దేవతలు, రుషులు ఇచ్చే హారతినే ఈ మకరజ్యోతి అనే ప్రచారంలో ఉంది.

మకరజ్యోతి వేరు.. మకర విలక్కు వేరు..

మకర జ్యోతి అనేది ఒక నక్షత్రం. ఇది జనవరి 14వ తేదీన ఆకాశంలో కనిపిస్తుంది. అయితే మకర విలక్కు అనేది ఒక వెలుగు. ఇది కంఠమల పర్వతాలపైన కనిపిస్తుంది. అయితే చాలా మంది మకర విలక్కను చూసి మకర జ్యోతి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ రెండు వేర్వేరు. అలాగే ఇంకా కొందరు మకర జ్యోతి గురించి పురాణాల్లో ఎక్కడ ప్రస్తావన లేదని కొందరు చెబుతున్నారు. చరిత్రలో ఎక్కడా గానీ మకర జ్యోతి ప్రస్తావన అనేదే లేదని చెబుతున్నారు.


బౌద్ధమత గ్రంధాల్లో..

బౌద్ధమత గ్రంధాల్లో మాత్రం మకరజ్యోతి ప్రస్తావన గురించి పలు విషయాలు లభ్యమయ్యాయట. శబరిమల అంటే ఒకప్పటి బౌద్ధ ఆలయం అని, అయ్యప్ప అవలోకేశ్వర్ అనే బౌద్ధబిక్షువు అని ఆ గ్రంథంలో కొన్ని వివరాలు ఉన్నాయట.

మకరజ్యోతి గురించి మరో కథ..

ఇప్పుడు కనిపించే మకరజ్యోతి పొన్నాంబల్ మేడు పర్వతంలో ఒకప్పుడు గిరిజనులు నివాసముండే వారట. ఓ రోజు వారంతా సాయంత్రం చీకటి పడగానే చలికి తట్టుకోలేక పుల్లలు, కట్టెలు వేసి చలిమంటను వేసుకున్నారట. అయితే ఆరోజు సరిగ్గా మకర సంక్రాంతి. అది కాస్త అయ్యప్ప కొండ మీద ఉన్న భక్తులకు ఆ వెలుగు దూరం నుండి ఒక జ్యోతిలాగా కనిపించిందట. ఇదంతా యాదృచ్చికమే అయినా అక్కడి వారు ఇదంతా స్వామి వారి మహిమ అని నమ్మారట. అప్పటి నుండి దానిని మకరజ్యోతిగా పేర్కొనడం జరిగిందని ఓ కథ ఉంది.
ఆ తర్వాత అక్కడ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు రావడంతో అక్కడి గిరిజనులు కొండపై నివాసాన్ని వదిలి వెళ్లిపోయారట.

హేతువాదుల వాదన ఇలా..

కొందరు హేతువాదులు ఇందుకు సంబంధించి కొన్ని వాదనలు చేస్తున్నారు. పొన్నంబల ప్రాంతంలో ఓ టవర్ లోకి ఎక్కి కర్పూరాన్ని పెద్ద ఆవరణలో వెలిగించి పట్టుకుంటున్నారు. కానీ ఇది శబరిమల నుండి చూసే భక్తులకు ఇది మకరంలా కనబడుతుందని వారు చెబుతున్నారు.

No comments:

Post a Comment