Tuesday 17 December 2019

యూట్యూబ్ లుక్ మార్చేసిన గూగుల్.. యూజర్లకు కొత్త ఫీచర్లు..! New features added by YouTube

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ ప్లాట్‌ఫాం లుక్‌ను మార్చేసింది. మొబైల్‌తోపాటు డెస్క్‌టాప్‌లో యూట్యూబ్‌ను వాడుతున్న యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఆ సైట్‌ను గూగుల్ కొత్తగా తీర్చిదిద్దింది. ఈ క్రమంలో యూట్యూబ్ కొత్త వెర్షన్‌లో పలు నూతన ఫీచర్లను కూడా అందిస్తున్నారు.
యూట్యూబ్‌లో ఇకపై వీడియోలకు చెందిన థంబ్ నెయిల్స్ పెద్దవిగా కనిపిస్తాయి. అలాగే వీడియో క్రియేటర్లు తమ వీడియోలకు పొడవైన టైటిల్స్ పెట్టుకోవచ్చు. ఇక వీడియోలను ప్రివ్యూలో హై రిజల్యూషన్‌లో చూడవచ్చు. అలాగే హోం పేజీలో ఉండే వీడియోలను ప్లే లిస్ట్ రూపంలో సేవ్ చూసుకుని తరువాత వీక్షించవచ్చు. ఇక వీడియోల కింది భాగంలో ఆ వీడియోలను క్రియేట్ చేసిన వారి చానల్ ఐకాన్లు కూడా కనిపిస్తాయి. దీంతో వీడియో క్రియేటర్ ఎవరనేది యూజర్లకు సులభంగా తెలుస్తుంది. అలాగే మొబైల్ ప్లాట్‌ఫాంపై యూట్యూబ్ వీడియోలలో ఇకపై సజెస్టెడ్ వీడియోలు కనిపించవు. కానీ ఆ ఫీచర్‌ను డెస్క్‌టాప్ యూట్యూబ్‌లో అలాగే ఉంచారు. ఇక యూజర్లు తాము చూసే వీడియోలకు చెందిన రిలేటెడ్ వీడియోలు తమ యూట్యూబ్ హోం పేజీలో కనిపించేలా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ ఫీచర్‌ను ఇప్పుడు అందివ్వడం లేదు. త్వరలో అప్‌డేటెడ్ వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను అందివ్వనున్నారు.

No comments:

Post a Comment