Tuesday 29 October 2019

Mukhesh Ambani Reliance Group plans to enter in E-commerce Business like Alibaba ఈ-కామర్స్ వ్యాపారంలోకి రిలయన్స్ గ్రూప్ అమెజాన్,ఫ్లిప్ కార్ట్ లకి చెక్ పెట్టనున్న రిలయన్స్ గ్రూప్

ఆన్ లైన్ మార్కెట్లో అసలైన పోరుకు సై 

ఈ-కామర్స్ వ్యాపారంలోకి రిలయన్స్.  
అమెజాన్,ఫ్లిప్ కార్ట్ లకి చెక్ పెట్టనున్న ముఖేష్ అంబానీ.  

భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ చైనాలోని "అలీబాబా" తరహాలో ఇండియాలో ఈ-కామర్స్ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆన్లైన్ షాప్పింగ్ మార్కెట్ లో గరిష్ట వాటా దక్కించుకోవాలన్న తన కళను సాకారం చేసుకునేందుకు రూ. 1.73 లక్షల కోట్ల తో పూర్తి యాజమాన్య హక్కులతో సబ్సిడరీ ని ఏర్పాటు చేస్తున్నారు. రూ. 65,000 కోట్లతో ఏర్పడే హోల్డింగ్ కంపెనీకి రిలయన్స్ జియో లో కంపెనీ కి ఉన్న రూ. 65,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడిని తరలిస్తారు. అమెజాన్, ప్లిప్ కార్ట్, వాల్ మార్ట్,స్నాప్ డీల్ లతో తలపడేందుకు భారీ పెట్టుబడితో అంబానీ అడుగు పెడుతుండడంతో ఈ-కామర్స్ వ్యాపారములో రసవత్తర పోరుకు తెరలేవనుంది. 

Karthee's Khaidhi film review in telugu sensational hit కార్తీ నటించిన ఖైదీ సినిమా రివ్యూ తెలుగులో


Karthee's khaidhi Film Review in Telugu 
కార్తీ నటించిన ఖైదీ సినిమా ఇటీవలే 25-10-2019 న విడుదల అయింది. కాగా, 

కథ,దర్శకత్వం : లోకేష్ కనగరాజ్ 
నిర్మాతలు   :  1. ఎస్. ఆర్. ప్రకాష్ బాబు 
                          2. ఎస్. ఆర్. ప్రభు 
                          3. తిరుప్పూర్ వివేక్ 
సంగీతం       :      సామ్ సి.ఎస్. 
ఆర్టిస్ట్స్          :      కార్తీ,నరైన్, దీనా. 
కథ >>

హీరో కార్తీ  పేరు "ఢిల్లీ ". హీరో ఇంట్రడక్షన్ యావరేజ్ గ ఉంది. ఫైట్స్ బాగున్నాయ్ కానీ హైఫై గ లేవు. కథ రొటీన్ సినిమాలకి భిన్నంగా ఉంది. పోలీసులకి చిక్కిన 840 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ని గ్యాంగ్ స్టర్స్ కి దక్కకుండా చేయడమే సినిమా మెయిన్ స్టోరీ. కానీ కార్తీ యాక్షన్ సూపర్. క్యారెక్టర్లు ఎక్కువగా లేవు. పాటలు కూడా ఎక్కువగా లేవు. సినిమా ఆద్యంతం స్టోరీ రన్ అవుతూనే ఉంటుంది, ఇందులో కార్తీ లారీ నడుపుతూ చేసే ఫైటింగ్ సూపర్బ్ గా ఉంది. 
మరో ముఖ్య విషయం ఏమిటంటే సినిమా మొత్తం కార్తీ అదేనండీ మన హీరో ఢిల్లీ ఒకటే కాస్టూమ్స్ లో ఉంటాడు. 

మొత్తంగా సినిమా రొటీన్ సినిమాలకి భిన్నంగా ఉంది. "ఫ్యామిలీ"తో కలిసి చూడవలసిన సినిమా ఇది. 

రేటింగ్ : 3.5/5 

Monday 28 October 2019

Access Personal health records via MY HEALTH RECORD App.



Access Personal health records via "MY HEALTH RECORD" App.
All our health records will soon be available to you and the doctor to consult at the tap of the mobile phone. The Union Ministry of Health and Family welfare has developed an app that will allow users to store their detailed health profile, past prescriptions, lab records and diagnoses at one platform that they can share with medical professionals when they need it.
The app precludes the need to carry medical records when patients visit doctors. 
                           the app "MY HEALTH RECORD" is ready and set to be launched in a couple of months after security checks are complete. Equipped with multi-factor authentication. It is part of the mega National Digital Health blueprint that the center has prepared. This move is aimed at empowering with a one-stop forum to store all the details of their health which they can share professionals even if they are not carrying physical files around. The app will allow people to create profiles. It will password protected and users can keep updating physical or digital health records. When patients want doctors to access records, They can generate OTP with a medical professional.
                                                      The app My Health Record is designed in such a way that there will be different categories of records.



Saturday 19 October 2019

Successful Trading Tips in Telugu స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన నియమాలు

SUCCESSFUL TRADING TIPS IN TELUGU


స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన నియమాలు :


  • SEBI ( STOCK EXCHANGE BOARD OF INDIA ) అనుమతి ఉన్న స్టాక్ ఎక్సేంజ్ లలో సభ్యత్వం ఉన్న , గుర్తింపు ఉన్న బ్రోకర్లు ,సబ్ బ్రోకర్లు ద్వారా మాత్రమే ట్రేడింగ్ లావాదేవీలు జరపాలి. 
  • ట్రేడింగ్ చేయడానికి ముందు షేర్స్ కి సంబందించిన పూర్తి వివరాలు అంటే ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే ముందు  ఆ స్టాక్ కి సంబందించిన పూర్తి విశ్లేషణ , అవగాహన తెలిసి ఉండాలి. 
  • ప్రతీసారి లాభాలు వస్తాయని భ్రమతో  అవగాహన లేకుండా ట్రేడింగ్ చేయవద్దు. 
  • కంపనీ స్థితి గతులు, పనితీరు, క్వార్టర్లీ రిజల్ట్స్, భవిష్యత్తు, వంటి అంశాలను విశ్లేషించిన తరువాతే ఏ స్టాక్ లో నైనా పెట్టుబడి పెట్టాలి. 
  • స్టాక్ బ్రోకర్ లకి చెల్లించే మొత్తాలను బ్యాంకు ద్వారానే చెల్లించాలి . 
  • మీరు చేసే ట్రేడింగ్ లో స్టాప్ లాస్ ను కచ్చితంగా పెట్టాలి. 
  • మీరు ఏంత నష్టాన్ని భరించగలుగుతారో అందుకు అనుగుణమైన పెట్టుబడి వ్యూహాలను అనుసరించాలి. ఏందుకంటె షేర్ మార్కెట్ ట్రేడింగ్ లో ఎంతోకొంత నష్ట భయం ఉంటుంది. 
  • ఎవరో చెప్పారని, వదంతులు వచ్చాయని ఏ స్టాక్ లోనూ పెట్టుబడి పెట్టవద్దు. నిజమా, కాదా అని నిర్దారించుకున్నాకే ఇన్వెస్ట్ చేయండి. 
  • స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో లాభాలెంత సహజమో, నష్టాలు కూడా అంతే సహజం అని గుర్తుంచుకోవాలి. 
  • తక్కువ ధరకి లభిస్తున్నాయని బలహీన కంపెనీ షేర్స్ కొనవద్దు. 

Saturday 12 October 2019

What is Demat Account? How to open this?డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి? ఓపెన్ చేయడం ఎలా?

డీమ్యాట్  అకౌంట్ అంటే ఏమిటి? ఓపెన్ చేయడం ఎలా?


క బ్యాంక్ లో ఏవిధంగా మనము డబ్బులు డిపాజిట్ చేయాలన్నా విత్ డ్రా చేయాలన్న మనకు  బ్యాంకు అకౌంట్ అవసరమో, అలాగే షేర్ మార్కెట్లో షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా డీమ్యాట్ అకౌంట్ అవసరం. అయితే మొదట డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ముందుగా మనకి బ్యాంకు అకౌంట్ ఉండితీరాలి. ఏందుకంటె మీ స్టాక్స్ యొక్క డివిడెండ్స్ , బోనస్ లు మీ అకౌంట్లోనే జమ అవుతాయి కాబట్టి. ఐతే  డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి మీరు పాన్ కార్డు కలిగి ఉండి,ఏదేనా స్టాక్ బ్రోకరేజీ సంస్థ ను సంప్రదిస్తే వారు మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు. ఈ రోజుల్లో చాలా బ్రోకరేజీ సంస్థలు ఉచితంగానే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తున్నాయి. 
ఇండియాలో కొన్ని బ్రోకరేజీ కంపెనీలు: 

ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే డీమ్యాట్ అకౌంట్ యొక్క లావాదేవీలు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి. ఇదివరకు కాగిత రూపంలో షేర్స్ లావాదేవీలు జరుగగా ప్రస్థుతం  ఆన్లైన్  రూపంలోనే లావాదేవీలు జరుగుతున్నాయి.  డీమ్యాట్ అకౌంట్లో లావాదేవీలు చాలా భద్రంగా ఉంటాయి. మీ షేర్లను వేరేవాళ్లు మీకు తెలియకుండా గ్యాంబ్లింగ్ చేసే అవకాశం ఉండదు. 

బ్యాంక్ లలో మాదిరి ఒక బ్యాంకు యొక్క బ్రాంచ్లో ఒకటే బ్యాంకు ఖాతా  ఉండాల్సిన పని లేదు. అంటే ఒక వ్యక్తి ఒక్క డీమ్యాట్ అకౌంట్ ఖాతాని తెరవాలన్న నిబంధన లేదు.  ఎన్ని డీమ్యాట్ అకౌంట్లు  ఐన ఓపెన్ చేసుకోవచ్చు. 

FNO PLAY mobile trading demo || bazigarr ||


Monday 7 October 2019

స్టాక్ లేదా షేర్ అంటే ఏమిటి? WHAT IS STOCK OR SHARE?

స్టాక్ లేదా షేర్ అంటే ఏమిటి?  WHAT IS STOCK OR SHARE?

ఒక కంపెనీ తన యాజమాన్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించగా వచ్చే వాటాలను స్టాక్ లేదా షేర్ అంటాము. ఈ స్టాక్ ని ఈక్విటీ, బాండ్స్ ఫైనాన్సియల్ సెక్యూరిటీ అని వివిధ రకాలుగా పిలుస్తారు. ఒక కంపెనీలో స్టాక్స్ కొనడం వల్ల మీరు కంపెనీలో భాగస్వాములు అవుతారు. గరిష్ట వాటాలను కొన్న వ్యక్తి గరిష్ఠ యాజమాన్య హక్కులను కలిగి చైర్మన్ లేదా డైరెక్టర్ కావచ్చును. 

ఉదాహరణకు ఒక కంపెనీ మూలధనంగా సేకరించాల్సిన రూ . 1,00,00,000 /- లను 10 విలువ కలిగిన 10,00,000 ల వాటాలుగా విభజిస్తే, అప్పుడు ప్రతీ ఒక వాటా లేదా షేర్ విలువ రూ. 10/- అవుతుంది.  ఈ షేర్స్ ని కంపెనీ వారు నిర్ణయించిన ధర ప్రకారం కొనవలసి ఉంటుంది. మీకు కంపెనీ లో ఉన్న షేర్స్ ని బట్టి మీ యాజమాన్య వాటా శాతం నిర్ణయింపబడుతుంది. అలాగే వాటాదారులకు కంపెనీ లాభాలలో వాటా చెల్లించబడును.  కంపెనీ తీసుకునే నిర్ణయాలలో వాటాదారులకు ఓటు హక్కు ఉంటుంది. 

Sunday 6 October 2019

Why People Invest in Stockmarket ? స్టాక్ మార్కెట్లో ప్రజలు ఎందుకు ఇన్వెస్ట్ లేదా పెట్టుబడి పెట్టాలి ?

WHY PEOPLE INVEST IN STOCKMARKET
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల మిగతా ఆదాయ వనరులలో పొందిన రాబడి కంటే అధిక రాబడి పొందవచ్చును. ఇందుకు మీకు స్టాక్ మార్కెట్ పై పరిపూర్ణ జ్ఞానం అవసరం. ఎందుకంటే ఏ పనిలోనైనా పూర్తి మెళకువలు తెలుసుకున్నపుడే దానిపై పట్టు సాధించి విజయం అనే అవకాశాలను పొందుతాము కదా . 
             
                                 స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతావా అని ఒక సాధారణ పౌరున్ని అడిగితే  అతడు ఆమ్మో అది ఒక జూదం ,లాటరీ , గుర్రపు పందెం లాంటిది  దానిలో సంపాదించాలంటే లక్ ఉండాలి అని సమాధానం  ఎదురవుతుంది.  కానీ నిజానికి ఇది అపోహ మాత్రమే. లాటరీ , గుర్రపు పందాలు గెలవడానికి అదృష్టం కావాలి కానీ , స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడానికి అవగాహన , మార్కెట్ రిస్క్ ను ముందే పసిగట్టగల చక్కటి పరిజ్ఞానం ఉంటె సరిపోతుంది. 
స్టాక్ మార్కెట్ ఒక మంచి పెట్టుబడి సాధనం . ప్రణాళిక ద్వారా , క్రమ పద్దతిలో పెట్టుబడి పెడితే లీగల్ గా అంటే చట్టబద్దంగా సంపాదించిన సంపద ఒక్క స్టాక్ మార్కెట్లో తప్ప దేనిలోనూ సంపాదించలేము. ఈ స్టాక్ మార్కెట్ ద్వారానే వారెన్ బఫెట్  ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరు గా నిలిచారు. ఇంకా ఎంతో మంది సంపాదిస్తూనే ఉన్నారు . 
ధీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పెట్టె పెట్టుబడుల తాలూకు లాభాలని గమనిస్తే స్టాక్ మార్కెట్ తర్వాతే బంగారం,స్థలాలు తదితర వ్యాపారాలు అని తెలుస్తుంది.  ఈ విషయాన్నీ అర్ధం చేసుకోడానికి ఈ క్రింది ఉదాహరణ ని ఒకసారి గమనించినట్లయితే ,

  • 1980 లో మీరు విప్రో కంపెనీ 100 రూపాయలు ముఖ విలువ గలవి ఒక 100 షేర్లను కొనడానికి 10000 రూపాయలను పెట్టుబడి పెట్టారనుకుంటే ఇప్పుడు వాటి విలువ సుమారుగా 433 కోట్ల పైమాటే . అదెలాగంటే ,
  • 1981 లో విప్రో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది .అంటే కంపెనీలో మీకు ఒక షేర్ ఉంటె అదనంగా ఇంకో షేర్ మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే  కంపెనీ మీకు ఇస్తుంది,అలా  మీరు కొన్న 100 షేర్లు ఇప్పుడు 200 షేర్లు అయ్యాయి . 
  • 1985 లో కంపెనీ మల్లి 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది. ఇప్పుడు మీ షేర్స్ 400 అయ్యాయి. 
  • 1987 లో కంపెనీ షేర్ల ముఖ విలువను 10 రూపాయలుగా విభజించి 1:1 నిష్పత్తిలో బోనస్  ప్రకటించింది. ఇప్పుడు మీ షేర్లు 8000 అయ్యాయి. 
  • 1990 లో మరల 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించగా 8000 షేర్లు కాస్తా 16000షేర్లు అయ్యాయి. 
  • 1993 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది . ఇక్కడ 16000 షేర్లు కాస్త 32000 షేర్లు అయ్యాయి. 
  • 1995 లో 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించగా  32000 షేర్లు 64000 షేర్లు అయ్యాయి. 
  • 1998 లో కంపెనీ 2:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది. ఇక్కడ అమాంతం 64000 షేర్లు కాస్త 192000 షేర్లు అయ్యాయి. 
  • 1999 లో కంపెనీ షేర్ల ముఖ విలువను 2 రూపాయలుగా విభజించగా 192000 షేర్లు కాస్త 9,60,000 షేర్లు అయ్యాయి. 
  • 2004 లో విప్రో  2:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించగా మరల 9,60,000 షేర్లు కాస్తా 28,80,000 షేర్లు అయినవి. 
  • 2005 లో 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించగా మీ షేర్స్ ఇప్పుడు 57,60,000 షేర్స్ అయినవి. 
  • 2010 లో 2:3 నిష్పత్తిలో బోనస్ ప్రకటించగా మీకు ఉన్న షేర్లు 96,00,000. 
అంటే 96,00,000 షేర్ల విలువ లెక్కగడితే 432,00,00,000 రూపాయలు. అక్షరాలా  నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు.  

అంటే ఒక ప్రణాళిక ప్రకారం మంచి స్టాక్ ను ఎన్నుకొని దానిలో ఇన్వెస్ట్ చేస్తే లాభం ఎలా ఉంటుందో పై ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. కనుక స్టాక్ మార్కెట్ పై అపోహలు మాని ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక లాభాలను సొంతం చేసుకోవచ్చును గనుకనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి.


What is Investing ? ఇన్వెస్టింగ్ లేదా పెట్టుబడి అంటే ఏమిటి ?

  • WHAT IS INVESTING ? ఇన్వెస్టింగ్  లేదా పెట్టుబడి  అంటే ఏమిటి ?
లాభాపేక్షతో  ఏదేని ఒక ఆదాయాన్ని ఇచ్చే వనరు లేదా వస్తువు లేదా సేవ పై మన దగ్గర ఉన్న డబ్బును ఖర్చు చేస్తే అది "పెట్టుబడి" లేదా" ఇన్వెస్టుమెంట్" అవుతుంది. అయితే ఇక్కడ తిరిగి ఆదాయాన్ని ఇచ్చే వాటిపై ఖర్చు చేస్తేనే అది పెట్టుబడి అవుతుంది. ఆదాయాన్ని ఇవ్వని వాటిపై ఖర్చు చేస్తే అది పెట్టుబడి కాదు వ్యయం మాత్రమే.

ఆధాయాన్నిచ్చే కొన్ని పెట్టుబడి లేదా ఇన్వెస్టుమెంట్ మార్గాలు :
  1. స్థిరాస్తి 
  2. బ్యాంకు డిపాజిట్లు 
  3. వడ్డీ ఆదాయం 
  4. అద్దె ఆదాయం 
  5. సేవింగ్ సర్టిఫికెట్స్ 
  6. పోస్ట్ ఆఫీస్ పథకాలు 
  7. బంగారం 
  8. బాండ్స్ 
  9. షేర్ మార్కెట్ 
  10. మ్యూచువల్ పండ్స్
  11. వ్యాపారం Etc.